కారు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్ ప్లాన్’!
- ప్రీపెయిడ్ సర్వీస్ సదుపాయం
- లేబర్‌పై 10% వరకు ఆదా
- భవిష్యత్ ధరల పెరుగుదల నుంచి రక్షణ
- 10 ఏళ్ల వరకు కవరేజ్
- దేశవ్యాప్తంగా ఏ వర్క్‌షాప్‌లోనైనా సేవలు
కారు కొనడం ఒక ఖర్చైతే, దాని నిర్వహణ మరో పెద్ద భారం. ముఖ్యంగా సర్వీసింగ్, విడిభాగాల మార్పిడి, ఇంజిన్ ఆయిల్ వంటి నిర్వహణ వ్యయాలు కాలక్రమంలో పెరుగుతుంటాయి. ఈ భారం తగ్గించేందుకు దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కొత్త ప్రీపెయిడ్ సర్వీస్ పథకాన్ని తీసుకొచ్చింది. ‘స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్ (ఎస్‌ఎంపీ)’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు ముందుగానే సర్వీస్ ఖర్చులను లాక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఈ ప్లాన్‌ను కొత్త కారు కొనుగోలు సమయంలోనే కాకుండా తర్వాత కూడా తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఏ మారుతీ వర్క్‌షాప్‌లోనైనా ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా లేబర్ మాత్రమే, లేబర్‌తో పాటు విడిభాగాలు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ వంటి ప్యాకేజీలను ఎంపిక చేసుకోవచ్చు. వాణిజ్య వాహనాల యజమానుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
ఈ పథకంలో చేరిన వారికి లేబర్ ఛార్జీలపై కనీసం 10 శాతం వరకు ఆదా ఉంటుందని మారుతీ వెల్లడించింది. అంతేకాదు, భవిష్యత్తులో సర్వీస్ ఛార్జీలు పెరిగినా ముందే చెల్లించిన ధరలకే సేవలు పొందే అవకాశం ఉంటుంది. క్లచ్, బ్రేక్ వంటి త్వరగా అరిగిపోయే భాగాలకు అదనపు రక్షణ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
వ్యక్తిగత వాహనాల కోసం 2 సంవత్సరాలు/20 వేల కిలోమీటర్ల నుంచి 10 సంవత్సరాలు/లక్ష కిలోమీటర్ల వరకు పథకాలు ఉన్నాయి. వాణిజ్య వాహనాల కోసం 10 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు కవరేజ్ లభిస్తుంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఏ మారుతీ వర్క్‌షాప్‌లోనైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.